మీర్ పేట్ చౌరస్తాలో ఐదు రూపాయలకు ప్లేట్ ఇడ్లీ

Published: Monday June 07, 2021
బాలపూర్, జూన్ 06, ప్రజాపాలన ప్రతినిధి : సి.ఎస్.సి పౌండేషన్ వారు కరోనా సమయంలో 5 రూపాయలకు ప్లేట్ ఇడ్లీ ఇస్తూ, మక్కువ చూపుతున్న ఆర్యన్ క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అభినందించారు. మహేశ్వరంనియోజకవర్గంలో మీర్ పేట్  మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మీర్ పేట్  చౌరస్తాలో ఆర్యన్ క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కామోజి శోభారాణి మల్లికార్జున ఆధ్వర్యంలో నిరుపేదలకు ఐదు రూపాయలకు ప్లేట్ ఇడ్లీ హబ్ ను మన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.....సి.ఎస్.సి  అకాడమీ  ప్రజలకు కరోనా సమయంలో సేవ చేయడం పట్ల మక్కువ చూపేందుకు ఐదు రూపాయలకు ప్లేట్ ఇడ్లీ పచ్చడి, త్రాగునీరు, ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఇస్తున్న వారికి అభినందనలు అన్నారు. స్థానిక పౌరులు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో ఈ సేవా కార్యక్రమానికి విరాళంగా ఇవ్వడం ద్వారా ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వొచ్చని తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి దాతలు ఎవరైనా ఉంటే వంద రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు విరాళం చేసుకోవచ్చని  మీర్ పేట్ ఎక్స్ రోడ్ లో ఇడ్లీ హబ్ సెంటరను సంప్రదించగలరుని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్  కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపు లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేషన్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అర్కల కామేశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్ అధ్యక్షురాలు సిద్ధల లావణ్య బీరప్ప, సిద్ధల చిన్న బీరప్ప, మాధురి రమేష్, ఇంద్రావత్ రవి నాయక్, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ కార్పొరేటర్లు, టిఆర్ఎస్ కార్యకర్తలు దిండు భూపేష్ గౌడ్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.