కోనాయిగూడెం ఆరుబయట మల విసర్జన రహిత గ్రామం దిశాగా అధికారుల ఇంటింటా సర్వే

Published: Thursday September 01, 2022
పాలేరు ఆగస్టు 30 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
ఓడీఎఫ్ గ్రామంలో మల విసర్జన గ్రామంలో ఇంటింటా సర్వే చేపట్టారు. మండలం లోని కోనాయిగూడెం లో మంగళవారం కూసుమంచి మండల అధికారులు సర్వే నిర్వహించారు. మొత్తం 318 ఇళ్ల ను ఆరు బృందాలు సర్వే చేశారు. మరుగుదోడ్లు. ఇంకుడు గుంతల నిర్వహణ, చెత్త సేకరణ తదితర అంశాల పై సర్వే చేపట్టారు. అంగన్వాడీ కేంద్రం. ప్రభుత్వ పాఠశాల, ఆరోగ్య ఉప కేంద్రాలల్లో పారిశుద్యం పై వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో నిర్దేశించిన అంశాల వారీగా బృందం సభ్యులు నివేదిక ను సిద్ధం చేస్తున్నారు. ఈ సర్వేలో టీమ్ సభ్యులు కూసుమంచి మండల పంచాయతీ అధికారి పూర్ణచందర్రావు. మండల విద్యాశాఖాధికారి రామాచారీ, ఐకేపీ ఏపీయం సత్యవర్ధన్, సర్పంచ్ పెంటమక పుల్లమ్మ. సీఆర్పీ లు కె.వెంకటేశ్వర్లు, షేక్ నాగుల్మోరా. డి.పుష్పావతి, టి.శ్రీనివాసరావు. పంచాయతీ కార్యదర్శి బోళ్ల వీరబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు 
పెద్ది జగన్నాధం. గ్రామదీపిక కొమ్మినేని పుష్పావతి, అంగన్వాడీ టీచర్,
వడ్లమూడి నాగమణి. ఆశా కార్యకర్త చెరుకుపల్లి బేబి, మల్టీపర్పస్ వర్కర్స్ బొడ్డు ఆంజనేయులు. కస్తాల గోపయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area