ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి * తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి వారికి పె

Published: Wednesday January 18, 2023

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టీయూఎఫ్  రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు  కొంతం యాదిరెడ్డి  జిల్లా ప్రధాన కార్యదర్శి  బోసుపెల్లి వీరేశ్ కుమార్  ఆధ్వర్యంలో ఈ రోజు అనగా తేదీ 17-01-2023 మంగళవారం రోజున ఇబ్రహీంపట్నం డాగ్ బంగ్లాలో  నియోజకవర్గం తెలంగాణ ఉద్యమకారుల ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో  టి యు ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గుర్జని వెంకటేశం గౌడ్ టి యు ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు  జెనిగె విష్ణువర్ధన్ . రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీ కారింగుల నరేందర్ గౌడ్  ముఖ్య అధ్యక్షులుగా హాజరైన ఈ సమావేశంలో చర్చించిన తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్స్ ఈ విధంగా ఉన్నాయి.
1), తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
2), తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం కల్పించిన  సంక్షేమ పథకాలాలలో 20% వాటాలు కేటాయించాలి. 3) ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలి. 4) ఆరోగ్య భద్రత కార్డు కల్పించాలి. 5), తెలంగాణ ఉద్యమకారులకు నామినేటెడ్ పోస్టులలో 20% వాటా కేటాయించాలి.6), తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రైతుబంధు పథకం ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ప్రకటించి  మిగతా డబ్బులను ఉద్యమకారుల సంక్షేమానికి కేటాయించాలి.7), దళిత బంధు పథకంలో ఉద్యమకారులకు , ప్రతి నియోజకవర్గంలో 20% వాటాలు ప్రకటించాలి.8), పట్టణాలలో ఉన్న నిరుపేద తెలంగాణ ఉద్యమకారులకు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి.9), గ్రామాలలో ఉన్న నిరుపేద తెలంగాణ ఉద్యమకారులకు ఒక ఎకరా ప్రభుత్వ భూమిని కేటాయించాలి.10) ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధులు గా గుర్తించి ప్రతీ నెలా 5,000/--పింఛను ప్రకటించాలి.11), పై డిమాండ్స్ తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించలేని, ఎడల, తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ మొత్తం తిరిగి బిక్షాటన చేసైనా సరే తెలంగాణ ఉద్యమకారులను రక్షించుకుంటాం అని వారు అన్నారు.