గిరిజన యువతి మానసకు న్యాయం చేయాలి దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

Published: Monday September 26, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల  మండలం మైలారం గ్రామానికి చెందిన తిమ్మల మానస గిరిజన మహిళకు న్యాయం చేయాలంటూ బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ వద్ద ఆదివారం దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నేన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన తిమ్మల మానస అనే గిరిజన మహిళను అదే గ్రామానికి చెందిన బొమ్మెన సంతోష్ గౌడ్ గత
 ఆరు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా, మానసికంగా, వాడుకొని ఐదు లక్షల కట్నమడిగి   గిరిజన యువతి అనే కారణంగా  ఇంకో మహిళతో ప్రేమ కొనసాగిస్తున్నాడని, వెంటనే పోలీస్ లు సంతోష్ గౌడ్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
  సంతోష్ గౌడ్ కు అండగా ఆయన సోదరుడు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొమ్మెన హరీష్ గౌడ్,తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అమ్మాయికి ఆన్న్యాయం చేస్తున్నాడని,  గిరిజన మహిళకు న్యాయం జరిగేలా చూడాలని, లేనిపక్షంలో ఎస్సీ ఎస్టీ ల ఆధ్వర్యంలో జిల్లాల వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని వారు  హెచ్చరించారు.
 ఈ కార్యక్రమంలో  మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి,   జిల్లా అధ్యక్షుడు కుంభాల రాజేష్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఆసాది మధు,
కార్యదర్శి ఎరుకల నర్సింగ్, ఉపాధ్యక్షులు మద్దెల గోపి,
పట్టణ అధ్యక్షులు బందెల మురళి, పట్నం చక్రధర్,
నేతకాని నాయకులు కలాలి నర్సయ్య,, గోమాస రాజం,దుర్గం గోపాల్, దుర్గం సురేష్, తదితరులు పాల్గొన్నారు.