బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు . మణుగూరులో క

Published: Wednesday September 28, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజా పాలన ప్రతినిధి..

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పూల మార్కెట్ సెంటర్ నందు  కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలు దహనం చేయడం జరిగింది...
 ఈ సందర్భంగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ,
 బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అవకాశాలు లేవనే  ప్రకటనపై తీవ్రంగా స్పందించారు...
ఏకారణాల చేత కేంద్రమంత్రి ఆ ప్రకటన చేశారో  తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. బయ్యారంలో పరిశ్రమ ఏర్పాటు ఎవరి దయా  దాక్షిణ్యాల వల్ల ఏర్పడేది కాదని అనేక పోరాటాల ఫలితంగా విభజన చట్టంలో రాజ్యాంగం గా హక్కు అని అన్నారు...
 కేంద్రమంత్రి  ప్రకటన వెనుక తెలంగాణ అభివృద్ధి కాకూడదనే దురుద్దేశంతో  ఉందని  విమర్శించారు. అన్నారు ,రాష్ట్రంలో సీఎం కేసీఆర్  ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చేపడుతున్న సంస్కరణలు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ మినహా మరొక రాజకీయ పార్టీ మన కలిగే స్థితిలో లేదని అన్నారు...
 ఈ పరిస్థితుల్లో అధికారదాహంతో తపిస్తున్న బిజెపి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన కూడదని ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు...
నష్టాల్లో ఉన్న అనేక పరిశ్రమలకు 72 వేల కోట్ల రూపాయల రాయితీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు హక్కు ను ఎలా కాదంటుందా అని ప్రశ్నించారు..
 రాష్ట్ర విభజన చట్టంలో అత్యంత ప్రాముఖ్యత అంశం బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అని తెలిపారు,అన్ని వనరులు ఉన్న బయ్యారంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కు చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు, పరిశ్రమ ఏర్పాటు జరిగితే  ఇక్కడి ప్రజలకు ఉపాధి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు...!!