గతంలో జరిగినట్లే బాలాపూర్ గణనాథుని పూజలు

Published: Tuesday September 07, 2021
బాలాపూర్: సెప్టెంబర్ 6, ప్రజాపాలన ప్రతినిధి : బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గతంలో జరిగిన గణేష్ ఉత్సవాలు చూడముచ్చట వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బాలాపూర్ గ్రామంలో గణపతి మహోత్సవాలకు మండపంలో గణనాథునికి గతంలో జరిగినట్లు ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి దగ్గర ఉండి అతి జాగ్రత్తగా స్టేజినీ తయారు చేస్తున్నారు. 15 అడుగులతో గణనాథుని విగ్రహాన్ని, సెప్టెంబర్ 10న ప్రతిష్టించపోతున్నామని, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారని అన్నారు. గతంలో జరిగినట్లు లడ్డు వేలం ఉంటుందని అదేవిధంగా గణనాథుని నిమజ్జనానికి చూడముచ్చటగా వైభవంగా అట్టహాసంగా జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులందరూ అన్నారు. కోవిడ్-19 నియమ నిబంధనలు పాటిస్తూ, గణనాథుని దర్శించుకునే భక్తులందరు పాటించగలరని కోరుకున్నారు. పోలీస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ప్రజలు..... గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ సహకరించగలరు కోరారు.