సమాజంలో శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకం దిరిశాల మధిర జూలై 31 ప్రజా పాలన ప్ర

Published: Monday August 01, 2022
డి వై ఎఫ్ ఐ ఆధ్వర్యంలోపోటీ పరీక్షలకు నమూనా పరీక్షలు నిర్వహించి యూత్ని ప్రోత్సహించడంలో డివైఎఫ్ఐ ఎప్పుడు ముందుంటుందియుటిఎఫ్ జిల్లా కార్యదర్శి రావిరాల లక్ష్మణరావుప్రభుత్వం నిర్వహించే కానిస్టేబుల్ పరీక్షకు దీటుగా డివైఎఫ్ఐ నిర్వహిస్తున్న  నమూనా పరీక్షఎంఈఓ ప్రభాకర్డివైఎఫ్ఐ పోలీస్ కానిస్టేబుల్ నమూనా పరీక్షకు విశేష స్పందనడివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్
భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మోడల్ కానిస్టేబుల్ పరీక్షను మధిర టౌన్ లో  తేళ్ళ వసంతయ్య మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత  హైస్కూల్లో *ప్రముఖ న్యాయవాది దిరిశల జగన్మోహనరావు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి రావిరాల లక్ష్మణరావు ఎంఈఓ ప్రభాకర్ పరీక్ష  ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివైఎఫ్ఐ నిర్వహిస్తున్న మోడల్ కానిస్టేబుల్ పరీక్ష  అభ్యర్థులకు బాగా ఉపయోగపడుతుందని, ఈ పరీక్ష రాయడం ద్వారా  అభ్యర్థులకు నమూనా అర్థమయి  ప్రభుత్వం నిర్వహించే  పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవచ్చని ఆయన అన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగ సాధించడం అంటే సమాజంలో శాంతి భద్రత పర్యవేక్షణ ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యతని,  ఈరోజు ప్రజలు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే దానికి కారణం పోలీస్ వ్యవస్థని ఆయన అన్నారు. అందుకే పోలీసులుగా  వస్తున్న వాళ్లు  సమాజ భద్రత కోసం, ప్రజల రక్షణ కోసం ఉండాలని అని పిలుపునిచ్చారుఅదేవిధంగా డివైఎఫ్ఐ నిర్వహిస్తున్న  మోడల్ పరీక్ష ప్రభుత్వం నిర్వహించే మోడల్ పరీక్షలు గీటుగా ఉందని వారు అభినందించారు. డివైఎఫ్ఐ చేస్తున్న పోరాటాలు త్యాగాలు మరియు సందర్భంగా గుర్తు చేశారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్* మాట్లాడుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్ కానిస్టేబుల్ పరీక్షకు విశేష  ఆదరణ వచ్చిందని, మరియు అందరికీ విద్య అందరికీ ఉపాధి కల్పించాలని తెలంగాణ రాష్ట్రం లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని అనేక పోరాటాలు నిర్వహించామని  ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించి యువజన విధాన ప్రకటించాలని పోరాటం నిర్వహిస్తూ యువతకు తోత్పటుగా నిస్తూన్నామన్నారు.ఈ నమూనా పరీక్షకు సహకరించిన వాళ్ళందరికీ, అతిథులుగా వచ్చిన వారందరికీ, పాల్గొన్న అభ్యర్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  *డివైఎఫ్ఐ జిల్లా నాయకులు రామిశేటి సురేష్ రావులపాటి నాగరాజు, ఎస్ కే సైదులు, దివ్వల వీరాంజనేయులు,  గద్దల ఆనంద్,  సాహెబ్, గుర్వేష్, హేమంత్, సాయి, రమేష్, ఖాదర్అక్బర్* ఇతరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area