మధిర సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి పుస్తకాలు పంపిణీ మధిర ఆగస్టు 29 ప్రజా పాలన ప్రతినిధిప

Published: Tuesday August 30, 2022

నందు వినాయక చవితి పండుగ సందర్భంగా సోమవారం మధిర సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక వ్రత కల్ప ప్రతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరుకుళ్ల లక్ష్మీ నరసింహారావు, గొండేల  ముత్తయ్య, దాచేపల్లి ముత్యాలు, కొల్లా శ్రీనివాసరావు హాజరై పంపిణీ చేశారు మిరియాల కాశీ విశ్వేశ్వర రావు ఆర్థిక సహకారంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు హిందువుల తొలి పండగ వినాయక చవితి ఏ కార్యక్రమం చేపట్టిన తొలి పూజ వినాయకునికి, నీలాప నిందలు పోగొట్టే వినాయక వ్రత కల్ప పుస్తకం ద్వారా కథలోని అంశాలతో పూజ చేస్తూ విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని భక్తులు తొలి పూజతో గణనాథుని పూజిస్తారని వారు తెలిపారు. మధిర సేవా సమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు మాట్లాడుతూ హిందువుల తొలి పండగ వినాయక చవితి నుండి ప్రారంభమై అనేక పండుగలు మన సంప్రదాయాలు విశిష్టతలు తెలియజేస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమటిడి శ్రీనివాసరావు, యర్రా లక్ష్మణ్, వందనపు శ్రీనివాసరావు, పబ్బతి రమేష్, కొత్తమాసు రామారావు, పల్లపోతు నరసింహారావు, కోమటి సుధాకర్, దూపుకుంట్ల లక్ష్మీనారాయణ, దోసపాటి వెంకట నాగ సోమేశ్వరరావు, దాచేపల్లి రాము,ఎస్ కే ఖాదర్ (ఆర్టీసీ డిపో రిటైర్డ్), సాదినేని సత్యం, చిట్లూరి విశ్వేశ్వరరావు, గుర్రం రాము, కిలారు వినోదు పాల్గొన్నారు.