ప్రతి ఐదువేల ఎకరాల సాగు భూమికి ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేయాలి

Published: Wednesday June 15, 2022
: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో జూన్ 14 ప్రజాపాలన : 
ప్రతి ఐదువేల ఎకరాల సాగు భూమికి ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
 మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా బంట్వారం మండల పరిధిలోని నూరుల్లాపూర్ మరియు యాచారం గ్రామాలలో గ్రామ సర్పంచ్ బలవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాములు యాదవ్ ఉదయం  6:30 గంటల నుండి 10:30  వరకు పర్యటించారు. యాచారం గ్రామంలో మంచిగా పనిచేస్తున్న ఏఎన్ఎం ను మా గ్రామం నుండి బదిలీ చేశారని, మాకు తనే కావాలని ప్రజలు కోరగా ఎమ్మెల్యే వైద్య అధికారులతో మాట్లాడి ప్రజల కోరిక మేరకు ఏఎన్ఎం ను యాచారం గ్రామంలోనే కొనసాగించాలని ఆదేశించారు. సాగు భూమి ఆధారంగా బంట్వారం మండలంలో ఇంకా రెండు వ్యవసాయ క్లస్టర్ లు ఏర్పాటు చేసి ఇద్దరు ఏఈఓ లను  నియమించాలని డిఏఓను ఆదేశించారు.  నూరుల్లా పూర్ గ్రామంలో మరియు యాచారం గ్రామంలో పాడుబడ్డ ఇండ్లు మరియు పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. గ్రామంలో వంగి ఉన్న విద్యుత్ స్థంబాలను, పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను  సరిచేయాలని, విద్యుత్ అధికారులను ఆదేశించారు.  మిషన్ భగీరథ మంచినీటి నల్లా కనెక్షన్ ప్రతీ ఇంటికి కచ్చితంగా ఇవ్వాలని, గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి అన్ని వార్డులకు సరిపడా నీటిని అందించాలని, ఎక్కడ కూడ లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు  పరిశీలన చేస్తూ... నీటి సరఫరా చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.