రహదారులపై కె.జి. వీల్స్ వాహనాలు నడుపరాదు : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి.

Published: Tuesday July 06, 2021

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూలై 5, ప్రజాపాలన : జిల్లాలోని రహదారులు, అంతర్గత రోడ్లపై ఎక్కడా కూడా కె.జి. వీల్స్ వాహనాలు నడుపరాదని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొలాలతో ఉపయోగించే కె.జి. వీల్స్ వాహనాలు రహదారులపై నడపడం వల్ల రోడ్లు చెడిపోతున్నాయని, వీటిని పొలాలలో మాత్రమే ఉపయోగించాలని, రోడ్లపై నడపరాదని తెలిపారు. ఒకవేళ ఈ చక్రాలతో రహదారులపైకి వచ్చినట్లతే వాహన యజమానులపై కేసు నమోదు చేయడంతో పాటు జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.