మాటూరు పేట బడి బాటమధిర

Published: Thursday June 16, 2022
రూరల్ 15 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలోబుధవారం నాడు ప్రాథమిక పాఠశాల మాటూరు పేట* బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామంలో బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించ వలసిందిగా  ర్యాలీ నిర్వహించడం జరిగింది. బంధువుల ఇళ్లకు వెళ్లిన పాఠశాల విద్యార్థినీ విద్యార్థులను వెంటనే రప్పించి పాఠశాలకు పంపవలసిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిందని, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గ్రామ సర్పంచ్ శ్రీమతి శివ నాగ కుమారి మరియు  విద్యా కమిటీ చైర్మన్ అద్దంకి కృష్ణ తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి శివ నాగ కుమారి విద్యా కమిటీ చైర్మన్ అద్దంకి కృష్ణ, పంచాయతీ కార్యదర్శి నరేంద్ర రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు రావూరి రామారావు, సురేష్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు..