బీసీల అభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

Published: Friday December 09, 2022
జన్నారం,నవంబర్ 08, ప్రజాపాలన: బీసీలను రాజకీయంగా అభివృద్ధి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీసీ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలోని విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు 12 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటి ద్వారా బీసీలకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నమన్నారు. అదేవిధంగా బీసీ కులాలు పడుతున్న ఇబ్బందులతో పాటు రిజర్వేషన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్తూ పార్లమెంటు ప్రస్తావిస్తాం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాసంఘ్రమ పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగిందని సెట్టుపెళ్లి గంగయ్య, కాసెట్టి లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ కులాల పక్షాన నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం లో బండి సంజయ్సంజయ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, కలిసికట్టుగా పాల్గొన్న సహచలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కే ఏ నరసింహులు, శ్రీరాముల గంగాధర్, కోడిజుట్టు రాజన్న, పిల్లి మల్లయ్య అల్లం నరేష్, మామిడి విజయ్, ఆడేపు లక్ష్మీనారాయణ, మూల భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.