విద్యా రంగానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట జడ్పీచైర్మన్

Published: Wednesday August 03, 2022

మధిర ఆగస్టు 2 ప్రజా పాలన ప్రతినిధి విద్యా రంగానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు  పేర్కొన్నారు. మంగళవారం మధిర మండలం చిలుకూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా నూతనంగా నిర్మించిన తరగతి గదులను తాగునీరు వసతులను విద్యార్థుల హాజరు శాతాన్ని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన మధ్యాహ్నం భోజనంపై విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలసి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యా రంగానికి  పెద్దపీట వేసిందన్నారు. విద్యా విధానంలో ముఖ్యమంత్రి కేసీఆర్  విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. మన ఊరు మన బడితో అన్ని పాటశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడం జరుగుతోందని ఆయన తెలిపారు. చిలుకూరు గ్రామంలో ఒక్క విద్యార్థి కూడా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నందుకు తల్లిదండ్రులకు పిల్లలకు నమ్మకంగా విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెండెం లలిత మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు పట్టణ పార్టీ అధ్యక్షుడు పల్లపోతు వెంకటేశ్వరరావు రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జి తాళ్లూరి హరీష్ బాబు మాజీ సర్పంచ్ నిడమనూరి జయమ్మ  సత్యం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.