చిన్నారుల ఆరోగ్య పరిరక్షణపై తల్లులకు అవగాహన

Published: Thursday March 04, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో మాతృ సంరక్షణ కూడా ఒకభాగమేనని వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుమన్ కళ్యాణ్,డాక్టర్ జ్యోతి అన్నారు. బుధవారం మండల పరిధిలోని దుప్పల్లి గ్రామంలో నిర్వహించిన చిన్నపిల్లల ఆరోగ్య పరిరక్షణపై తల్లులకు వివరిస్తూ తల్లుల పరిరక్షణలో పిల్లల ఆరోగ్యంగా ఉంటారని, తల్లి గర్భిణిగా ఉన్నప్పటి నుంచి మంచి పోషకాహారం తీసుకోవాలని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కావాలని, బిడ్డ పుట్టిన గంట లోపల తల్లి పాలు పట్టాలన్నారు. చిన్నపిల్లలకు అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు యిప్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకుడు నాశబోయిన నర్సింహా, హెల్త్ అసిస్టెంట్లు ఎన్ అనిత, జడిగే సత్తయ్య, ఆశా కార్యకర్తలు కవిత, యాదమ్మ, తల్లులు తదితరులు పాల్గొన్నారు.