చర్ల పటేల్ గూడెం లో పెద్దమ్మ తల్లి దేవత బలిపీఠం సింహవాహన ప్రతిష్ట

Published: Thursday August 26, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 25, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం చర్ల పటేల్ గూడెం గ్రామంలో తేదీ 26 గురువారం నుండి 29 ఆదివారం వరకు పెద్దమ్మ తల్లి దేవత బలిపీఠ సింహవాహన ప్రాణప్రతిష్ట మరియు అమ్మవారికి బోనాల సమర్పణ పలహార బండ్లు ఊరేగింపు పలు కార్యక్రమాలు ప్రతిష్ట పురోహితులు శ్రీ రేవల్లి రాజు శర్మ చండీ ఉపాసకులు త్రీ శతాధిక ప్రతిష్ట చార్యుల ఆధ్వర్యంలో బోనాల వేడుకలు జరుగుతాయని గ్రామ ప్రజలందరూ పాలక వర్గానికి, యాదవ సంఘం సభ్యులకు కరోనా నిబంధనలు పాటిస్తూ సహకరించాలని చర్ల పటేల్ గూడా గ్రామ సర్పంచ్ కంబాలపల్లి గీతం  రామ్ రెడ్డి  తెలిపారు.  వేణుగోపాల యాదవ సంఘం సభ్యులు చర్ల పటేల్ గూడెం గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమ వివరాలు: 26వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు గ్రామ ప్రధాన వీధుల్లో అమ్మవారి విగ్రహ ఊరేగింపు, 27వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశనం, గోపూజ, కంకణధారణ, యాగశాల ప్రవేశం, యోగిని వాస్తు క్షేత్రపాలక నవగ్రహ సర్వతోభద్ర కలశపూజలు, అంకురారోపణం, అగ్ని ప్రతిష్ట,  జలాధివాసం,యజ్ఞం, హారతి, 108 మృత్తి కాకలశాలతో  మహా స్నపనం,  ధాన్యది వాసం, హోమం, పూజలు, జపాలు, పారాయణాలు, జీవతత్వం ప్రాణకళాహోమాలు, శయాదివాసం, పుష్ప ఫలవస్త్రాధి వాసాలు, హారతి రాత్రికాల ముహూర్తము నందు యంత్ర ప్రతిష్ఠ 28 శనివారం రోజున పాతకాలం పూజలు, హోమాలు, గర్త పూజలు, పీటపూజలు, పెద్దమ్మతల్లి విగ్రహ బలిపీఠం సింహవాహన ప్రాణప్రతిష్ఠ  ధర్మ దర్శనం, హారతి  29 ఆదివారం రోజున అమ్మవారికి బోనాలు సమర్పణ తదితర కార్యక్రమాలు ఉంటాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేయడం జరిగింది.