ఉద్యమ స్మృతులను గుర్తుచేసుకున్న ఉద్యమకారులు : భానూరి ఉపేందర్ రెడ్డి

Published: Tuesday February 08, 2022
వికారాబాద్ బ్యూరో 07 ఫిబ్రవరి ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాడిన ఉద్యమకారుల తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నామని ఉద్యమకారుడు భానూరి ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం నవాబ్పేట్ మండల పరిధిలో గల గంగ్యాడ గ్రామంలోని ఉద్యమకారులను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ కలిసి ఉద్యమ పోరాట స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా విద్యార్థి ఉద్యమ నాయకుడు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రదపటేల్ మొదటిసారిగా గంగ్యాడ గ్రామానికి వచ్చారనిి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులను ఆప్యాయంగా పలకరించారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ఉద్యమకారులు హనుమాన్ మందిర్ వద్ద ఘన సన్మానం చేశామని వివరించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఘటనలు ముఖ్యంగా మాజీ కేంద్ర మంత్రి వర్యులు, అప్పటి హోమ్ మంత్రి పై కోడిగుడ్లు, టమాటాలు విసిరి తెలంగాణ ఆకాంక్షను తెలిపామన్నారు. క్రిమినల్ కేసు లు ఎదుర్కొని జైలు జీవితాన్ని గడిపిన స్మృతులను, రైల్ రోకోలు, రాస్తా రోకోలు గుర్తు చేసుకున్నామని చెప్పారు. జైలు జీవితంలో తనతో పాటు భానూరి ఉపేందర్ రెడ్డి, కి,శే ధవల్ గారి మహేందర్ రెడ్డి, గుండాల ప్రభాకర్ రెడ్డి లను ఈ సందర్భంగా శుభప్రధ్ పటేల్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారుడు భానూరి ఉపేందర్ రెడ్డి గ్రామానికి చెందిన దోసడ పెంటయ్య (d.p) ఆమరణ నిరాహార దీక్ష & సేల్ టవర్ ఎక్కిన విషయాలను శుభప్రధ పటేల్ దృష్టికి తీసుకువచ్చారు. పెంటయ్యకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.  ఉద్యమ కారులు శుభప్రద పటేల్ వెంట ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.