చెయ్యెత్తిజైకొట్టుతెలుగోడా

Published: Tuesday March 14, 2023
 నాటునాటుకు ఆస్కార్ రావడం హర్షనీయంఎంపీ రవిచంద్ర డాక్టర్ వాసిరెడ్డి రామనాథం మధిర మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా నాటు నాటు కు ఆస్కారం రావడం హర్షినియమని
ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాభినందనలుఎంపీ రవిచంద్ర డాక్టర్ వాసిరెడ్డి రామనాథంనాటునాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారం రావడం పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం హర్షం వ్యక్తం చేశారు.ఇది తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణమని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.ఈ పాట రచయిత జయశంకర్ భూపాలపల్లికి చెందిన చంద్రబోసు, ఇది పాడిన హైదరాబాద్ నగర వాసి రాహుల్ సిప్లిగంజ్ లకు రవిచంద్ర ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపారు.
అలాగే,మరో గాయకుడుకాలభైరవ,సంగీతం అందించిన కీరవాణి, చిత్ర దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ లకు ఎంపీ వద్దిరాజు తెలంగాణ రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు వారి పేరు ప్రతిష్ఠలను విశ్వ సినీ వేదికపై చాటిచెప్పిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని ఎంపీ రవిచంద్ర డాక్టర్ తెలంగాణ రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులువాసిరెడ్డి రామనాథం ప్రశంసించారు.