కరీంనగర్ శంకరపట్నం అక్టోబర్ 23 ప్రజాపాలన:

Published: Tuesday October 25, 2022

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా లో ఆదివారము రోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొని మాట్లాడుతూ ప్రధానమైన డిమాండ్లు చేశారు... భారతదేశ నూతన పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరును పెట్టాలని డిమాండ్ చేశారు... తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ ను నియమించాలని డిమాండ్ చేశారు... తెలంగాణ రాష్ట్రంలో దళిత జనాభా ప్రతిపాదికన ఎస్సీ రిజర్వేషన్స్ 15 నుండి 23% పెంచాలని డిమాండ్ చేశారు... భారతదేశ కరెన్సీ నోటు పై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని డిమాండ్ చేశారు.. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.... గత 40 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూములను దున్నుకుంటున్న దళితులకు శాశ్వత ప్రాతిపాదికన పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు... ఇట్టి సమస్యలన్నింటిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లాల వ్యాప్తంగా దళిత మహా పాదయాత్ర చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు ముందుగా కరీంనగర్ జిల్లా లోని అన్ని మండలాలను కలుపుకొని పాదయాత్ర చేపడతామన్నారు ఇట్టి కార్యక్రమం తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు తదనంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం లో నూతనంగా చేరికలు తీసుకున్నారు జాతీయ ఉపాధ్యక్షులు.. మామిడిపల్లి బాపయ్య.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ..మేడి మహేష్ ...రాష్ట్ర ఉపాధ్యక్షులు .కల్వల రామచంద్రం ..రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ.. మొగరం రమేష్.. రాష్ట్ర మహిళా నాయకురాలు మరియు జిల్లా మహిళా అధ్యక్షురాలు.. సుంచు లత శ్రీ ...గారి ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా... గరిగే ప్రభాకర్... జిల్లా ఉపాధ్యక్షులుగా ..కనకం విద్యాసాగర్.. టీగుట్ల రమేష్.. బూర్ల మొగిలి... జిల్లా కార్యదర్శిగా ...నల్లాల శ్రీనివాస్ ..జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా... కుంభాల లత ..కేశవపట్నం మండల అధ్యక్షులుగా... గొట్టే అర్జున్ ..కేశవపట్నం మండల ప్రధాన కార్యదర్శిగా... దేవనూరి కుమారస్వామి ...గారిని నియమించడం జరిగింది .సంఘం బలోపేతం కోసం వీరంతా కృషి చేయాలని కోరడం జరిగింది... ఇట్టి కార్యక్రమంలో హుస్నాబాద్ ఇంచార్జ్ వంతడుపుల దిలీప్ కుమార్....జిల్లా నాయకులు గడ్డం అనిల్ కుమార్... గంభీరావుపేట స్వర్ణ... దేవనూరి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు