స్క్రాప్ దొంగల అరెస్ట్

Published: Friday June 11, 2021

4లక్షల విలువైన చోరీ సొత్తు  రికవరీ.
మంచిర్యల జిల్లా, జూన్10, ప్రజాపాలన ప్రతినిధి : రాత్రిపూట స్క్రాప్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పట్టుకున్న జైపూర్ పోలీసులు పట్టుకు న్నారు. వారి నుండి సుమారు 4లక్షల విలువైన చోరీ సొత్తును రికవరీ చేయగా గురువారం మంచిర్యల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి సమక్షంలో నిందితులను మీడియా ముందు హాజరు పరచి వివరాలు వెళ్ళండి చేశారు. డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిసిన వివరాల ప్రకారం. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామ శివారులో ని వ్యవసాయ విడి పనిముట్లను తయారు చేసే అర్ఎస్  ఇండస్ట్రీస్ లో  గత సంవత్సరం నుండి కూలీలు దొరకక మూసివేయబడి ఉందని అందులో విడి పనిముట్లను తయారు చేయడానికి ఉపయోగించే ఇనుము ఉంచి తాళం వేయగా దొంగతనం కు గురైందని వడ్డేపల్లి జీవన్ కుమార్ జైపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి, జైపూర్ ఏసీపీ జి.నరేందర్ ఆదేశాలతో జైపూర్ ఎస్సై రామక్రిష్ణ, సి.ఐ సంజీవ్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో చోరీ చేసిన సుమారు 10 టన్నుల ఇనుమును, 02 ఆటోలను, 02 మోటార్ సైకిళ్ళును పట్టుకున్నారు.
పట్టుబడ్డ నిందితులు
చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను పట్టుకున్నారు. సిసి నస్పూర్, గాంధీనగర్ కు చెందిన మోటం తిరుపతి ఆటోడ్రైవర్, కిష్టంపేట, ఐబి తాండూర్ కు చెందిన మోటం సమ్మక్క, గాంధీనగర్, సిసి నస్పూర్ కు చెందిన మోటం శ్రీనివాస్, మిరియాల లింగయ్య లను అదుపులోకి తీసుకున్నారు. మోటం నరేష్, గాంధీనగర్, సిసి నస్పూర్. మోటం రాములు కిష్టంపేట, ఐబి తాండూర్ కు చెందిన ఇద్దరు పరారీలో ఉన్నారు. అదేవిధంగా దొంగతనం కేసులో అత్యంత కీలకంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్నా జైపూర్ ఎస్సై రామక్రిష్ణ ని తన సిబ్బంది రాజశేఖర్, సుబ్బారావు, శ్రీరాంపూర్ కానిస్టేబుల్ శ్రీనివాస్, జయచంద్ర లను డిసిపి, జైపూర్ ఏసిపి, శ్రీరాంపూర్ సిఐ టి సంజీవ్ లు అభినందించి రివార్డు అందజేయడం జరిగింది.