పరిమితికి మించి వాహనాల్లో ఎక్కిస్తే చట్టపరమైన చర్యలు తప్పవ్ నెన్నెల ఎస్ఐ రాజశేఖర్

Published: Tuesday June 28, 2022
బెల్లంపల్లి,  జూన్ 27 , ప్రజా పాలన ప్రతినిధి: 
 
వాహనాలకు ఫిట్నెస్ ప్పనిసరిగా ఉండాలని, పరిమితికి మించి విద్యార్థులను వాహనాల్లో తరలిస్తే చర్యలు తప్పవని నెన్నెల ఎస్ ఐ, రాజశేఖర్ వాహనదారులను హెచ్చరించారు.
బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో సోమవారం  నెన్నెల" టి" రోడ్డు వద్ద  ఎస్సై ఎస్. రాజశేఖర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి మండల కేంద్రానికి మరియు బెల్లంపల్లి కి, వెళ్ళే స్కూల్ వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారుల వద్ద పత్రాలను  పరిశీలించి,  సరిఅయిన పత్రాలు లేని వారికి ఈ- చాలన్స్ విధించారు. 
విద్యార్థులను స్కూల్ కి తరలించే వాహనాలు పరిమితికి మించిన విద్యార్థులను తరలించవద్దని,  ఆటోలకు, ముందు సీట్లలో పిల్లలను ఎక్కించారాదని. స్కూల్ బ్యాగ్ లను ఆటోలకు ఇరువైపుల తగిలించకూడదని, అతి వేగంగా వెళ్లరాదని తెలిపారు, వర్ష కాలంలో వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా వెళ్లాలని, వాహనాల ఫిట్నెస్ కండిషన్ చెక్ చేసుకోవాలని సూచించారు.
స్కూల్  యాజమాన్యాలు   విద్యార్థులకు సరిపడా వాహనాలను సమకూర్చాలని, లేనియెడల వాహన యాజమానుల మీద,  స్కూల్ యాజమాన్యాల పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.