తల్లాడలో సంపత్ బర్త్ డే వేడుకలు

Published: Friday July 15, 2022
తల్లాడ, జులై 14 (ప్రజాపాలన న్యూస్): జనగామ జిల్లా కేంద్రానికి చెందిన కొమరవల్లి దేవస్థానం మాజీ చైర్మన్ రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులు సేవెల్లి సంపత్ జన్మదిన వేడుకలు గురువారం ఇసనేపల్లి కృష్ణార్జున్, బాబురావు ఆధ్వర్యంలో తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్ కూడలిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు మోదుగు ఆశీర్వాదం, టిఆర్ఎస్ తల్లాడ టౌన్ ఉపాధ్యక్షుడు సంగసాని శ్రీను, దైత భాస్కర్, కే శ్రీను, గణేష్  పాల్గొన్నారు.
 
 
 
Attachments area