అన్నారుగూడెంలో బాబుజగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..

Published: Thursday April 06, 2023
తల్లాడ, ఏప్రిల్ 5 (ప్రజాపాలన న్యూస్): 

దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను బుధవారం మండలంలోని అన్నారుగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా దేశ ప్రజలకు అనేక సేవలు అందించారని గుర్తుచేశారు. యువకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ వేణు, బీఆర్ఎస్ నాయకులు మారెళ్ళ మల్లికార్జునరావు, మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.