ప్రతిభను వెలికి తీసేందుకు అవార్డ్స్ : మంత్రి తలసాని శ్రీనివాస్

Published: Tuesday March 22, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రతిభను వెలికి తీయడంతో పాటు వారిని ఆయా రంగాలలో ప్రోత్సహించేందుకు అవార్డులు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోషల్ మీడియాలో ప్రజా అభిమానం పొందిన వ్యక్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీని ఇన్ఫ్రా, యూ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లో ని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన ఇన్ఫ్లూయెన్సర్ 2022 అవార్డ్స్ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పలువురికి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సైతం వీడియోలు చేసుకునేవారికి తగిన గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ప్రధాన మీడియాతో సమానంగా సమస్యలను వెలికి తీయడంలో సోషల్ మీడియా సైతం తగిన కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, కథానాయకురాలు హెబ్బా పటేల్, పూర్ణ, బిగ్ బాస్ సన్నీ, హైపర్ ఆది, హరిప్రియ, నిర్మాతలు అంబికా కృష్ణ, దామోదర ప్రసాద్, ఎం ఎల్ సి రవీందర్ రావు, శ్రీని ఇన్ఫ్రా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.