ఘనంగా జన్ జాతీయ గౌరవ దివస్ దినోత్సవం.

Published: Friday November 18, 2022
భద్రాచలం (ప్రజా పాలన.) 
భద్రాచలంలో స్వాతంత్ర సమరయోధులు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సన్మానం తో పాటు వారం రోజులు పాటు ప్రతి ఆశ్రమం పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని గిరిజన సంక్షేమ శాఖ డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి అన్నారు.     గురువారం నాడు జన్ జాతీయ గౌరవ దివస్ దినోత్సవ సందర్భంగా భద్రాచలంలోని 
ఆశ్రమ గిరిజన సంక్షేమ శాఖ బాలికల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో అమరులైన చిత్రపటాలకు  పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆమె మాట్లాడుతూ బిర్సా ముండా చిన్న వయసులో ఉద్యమం చేపట్టారని ఆదివాసీలకు ఒక దాటిపై నిలవడానికి కృషిచేసిన మహోన్నత వ్యక్తి అని ఆమె అన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో నిలిచిపోయారని ఆదివాసుల సంక్షేమానికి పోరాడిన మహా వ్యక్తి అని అన్నారు. ఆదివాసుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు విడుదల చేయడం జరిగిందని దానిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటూ ఆదివాసీల ఆచార వ్యవహారాలు మర్చిపోకుండా భద్రాచలంలోని ఐటిడిఏ ప్రాంగణంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు.    ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏటి డి ఓ నరసింహారావు ట్రైబల్ మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి మరియు పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.