హెల్ప్ లైన్ పోస్టర్ ఆవిష్కరణ...

Published: Friday June 11, 2021
సారంగాపూర్, జూన్ 10, (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల కేంద్రంలో వయోవృద్ధులు వికలాంగులు పిల్లల కోసం హెల్ప్ లైన్ పోస్టర్ ను ఎంపీపీ కోల జమున శ్రీనివాస్ జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు. కోవిడ్ భారిన తల్లిదండ్రులు పిల్లలను సంరక్షణ కేంద్రంలో చేర్చేందుకు హెల్ప్ లైన్ నంబర్ 040- 23733665, గర్భిణులు బాలింతలకు కోవిడ్ కరోనా సోకితే 180059912345, వయోవృద్ధులు సహయార్థం 18005738980 హెల్ప్ లైన్ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ ఎంపీడీఓ పుల్లయ్య అంగన్వాడీ సూపర్వైజర్ టి. ఆదిలక్ష్మి అంగన్వాడీ టీచర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.