అంబేద్కర్ నగర్ లో నక్ష్యలో ఉన్న డొంక ఆక్రమణ ..

Published: Tuesday June 21, 2022
తల్లాడ, జూన్ 20 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలంలోని అంబేద్కర్ నగర్ గ్రామంలో కొంతమంది గ్రామస్తులు ప్రభుత్వ స్థలంలో ఉన్న డొంకను ఆక్రమించుకుంటున్నారని గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ కిరణ్ బాబు  తెలిపారు. ఆర్ అండ్ బి రోడ్డు నుండి మర్సకట్ల రవికుమార్ వరకు ఉన్న 33 అడుగుల డొంకను బొల్లెద్దుల రాజు, మేరమ్మ, మర్సకట్ల రవి కుమార్ ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. అదేవిధంగా ఆ డొంకలో  హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను జేసీబీ ద్వారా తొలగించారన్నారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి సంబంధిత వారికి నోటీసులు ఇచ్చినప్పటికీ వాటిని తీసుకోకుండా గొడవలకు పాల్పడుతున్నారని తెలిపారు. తక్షణమే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని  కోరారు.