పోలీస్ సిబ్బంది సి,పి,ఆర్, గురించి అవగాహన కలిగి ఉండాలి . జిల్లా ఎస్పీ సురేష్ కుమార్

Published: Thursday March 30, 2023

ఆసిఫాబాద్ జిల్లా మార్చి29 (ప్రజాపాలన,ప్రతినిధి) : పోలీస్ అధికారులు సిబ్బంది సి పి ఆర్ గురించి అవగాహన కలిగి ఉండాలని, జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ సి,పి,ఆర్, అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో చాలామంది గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య పెరగడంతో ప్రతి ఒక్కరిలో సిపిఆర్ పై అవగాహన కల్పించడం ముఖ్యమని, వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంటుందని, ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఒక వ్యక్తి చాతి మధ్య కింద భాగంలో రెండు చేతులతో చాతిపై ఒత్తుతు ఒత్తిడి తేవాలి. అలా నిమిషానికి 100 నుండి 120 సార్లు కంప్రెసర్ చేయాలన్నారు. అలా చేస్తే ఆక్సిజన్ ఊపేతీతరకు అంది మనిషి తిరిగి బ్రతికే అవకాశం ఉందని తెలిపారు. పోలీసులు తక్షణమే స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడడానికి తమ వంతు కృషి చేస్తుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) అచ్చేస్వర్ రావు, అదరపు ఎస్పీ(ఏఆర్) భీమ్రావు, సి,పి,ఆర్, ట్రైనింగ్ కోఆర్డినేటర్ సంతోష్, డాక్టర్స్ రాజు,సుజిత్, సి ఐ పవన్ కుమార్, ఎస్సైలు రమేష్, సందీప్, వెంకటేష్,గంగన్న, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.