మనోధైర్యమే కరోనా కు మందు.. ఆత్మస్థైర్యంతో ఉండండి : డా. కోట రాంబాబు

Published: Thursday June 24, 2021
మధిర ప్రజా ప్రతినిధి రూరల్ 23వ తేదీ మండలం మల్లారం గ్రామంలో కరోనా వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పరీక్షించిన డా. కోట రాంబాబు. మధిర మండలం మల్లారం గ్రామంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండడంతో విషయం తెలుసుకొన్న ఖమ్మం జిల్లా దిశ కమిటీ సభ్యులు, కె వి ఆర్ హాస్పిటల్ అధినేత డా.కోట రాంబాబు రోజు మల్లారం గ్రామాన్ని సందర్శించారు కరోనా వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వారికి ఊపిరితిత్తులకు ఆక్సిజన్ ఎంత అందుతుంది అని శాచురేషన్ లెవల్స్ మరియు బాడీ టెంపరేచర్ లెవల్స్ పరీక్షించారు. ఎవరికీ ఇబ్బంది లేదు అందరూ మంచిగా ఉన్నారు ధైర్యముగా ఉండండి అని వారికి మనోధైర్యము కల్పించారు. సరైన పోషకాహారం తీసుకుంటూ మాస్కులు పెట్టుకొని భౌతిక దూరం పాటించాలని మరియు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలును వారికి వివరించారు. అనంతరం వారందరికీ పండ్లు, మాస్కులు మరియు శానిటైజర్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మందడపు ఉపేంద్ర గ్రామ సెక్రెటరీ, ఆషా వర్కర్స్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.