విజ్ఞానానార్జనకు కేంద్ర బిందువు గ్రంథాలయాలు

Published: Monday November 21, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 20 నవంబర్ ప్రజా పాలన : విజ్ఞానార్జనకు కేంద్ర బిందువుగా గ్రంథాలయాలు విలసిల్లుతున్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 55వ గ్రంథాలయాల జాతీయ వారోత్సవాలు జిల్లా కేంద్ర గ్రంథాలయం సంస్థ అధ్యక్షుడు సుశీల్ కుమార్ గౌడ్, కార్యదర్శి సురేష్ బాబుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ అధ్యక్షుడు శ్రీధర్ అయాచితం మున్సిపల్ చైర్ ప‌ర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దోమ ఎంపిపి అనసూయ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... ప్రతి విద్యార్థి సమయం దొరికినప్పుడల్లా గ్రంధాలయాలను ఉపయోగించుకోవాలని, గ్రంథాలయాల్లో విషయపరిజ్ఞానం ఉంటుందని సూచించారు. సెల్ ఫోన్ లను పక్కనపెట్టి పుస్తకాలను చదివినప్పుడే పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. యువత చెడు వ్యసరాలకు అలవాటుపడకుండా పుస్తకాలకు దాసోహం కావాలన్నారు. లైబ్రరీ చైర్మన్  సుశీల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... వికారాబాద్ జిల్లా లో 17 గ్రంథాలయాలు ఉన్నాయని,అవి దినస్థితిలో వాటిని పట్టించుకొని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేలను కోరారు.జిల్లాలో ఈ లైబ్రరీల ఏర్పాటు కృషి చేయాలని అన్నారు. వికారాబాద్ జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులకు అవసరమైన ప్రతి పుస్తకాన్ని అందుబాటులో ఉంచడం జరిగిందని, పోటీ పరీక్షలకు అవసరమగు అనేక పుస్తకాలు ఉన్నాయన్నారు. పోటీ ప్రపంచంలో చదువులో సైతం పోటీపడుతూ ఉద్యోగాలు సాధించాలని కోరారు. అనంతరం వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ చూసిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు శ్రోతలను అలరించాయి.