PRESS NOTE

Published: Saturday September 24, 2022
22 మరియు 23 తేదీ లో దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో NQAS (సెంట్రల్ 
నేషనల్ క్వాలిటీ అష్యూరన్స్ స్టాండర్డ్స్)  లో భాగంగా జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల బృందం 
శ్రీమతి స్వాతి లక్ష్మి మరియు డాక్టర్ కల్పనల  బృంద పర్యటన ముగిసింది.
ఆసుపత్రి లోని ఆరు విభాగాల్లో _ అవుట్ పేషెంట్ సర్వీసెస్ , ల్యాబ్ రికార్డు, ప్రసూతి గది పరికరాలు, ఇన్ పేషెంట్ సర్వీసెస్  ,ఫార్మసీ రికార్డు లు , అడ్మినిస్ట్రేషన్ రికార్డు లు కూలంకుశం గా పరిశీలించారు. జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలు సెంట్రల్ టీం స్కోర్ ఆధారంగా సంబంధిత ఆసుపత్రులకు అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందని వైద్య అధికారి డాక్టర్ కిషోర్ తెలిపారు. ఈ రోజు ముగింపు కార్యక్రమం డిఎంహెచ్ఓ మహేందర్ గారి అధ్యక్షతన జరిగింది,  డిఎంహెచ్ఓ గారు మాట్లాడుతూ ఆసుపత్రి మరమ్మతులకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు  నాణ్యత హామీ ప్రమాణాలు సెంట్రల్ టీం శ్రీమతి స్వాతిలక్ష్మి మాట్లాడుతూ వారు గుర్తించిన లోటు పాట్లను వాటిని సరిచేసుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో డెప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కరుణశ్రీ గారు, ప్రోగ్రాం  ఆఫీసర్ మరియు డిడిఒ డాక్టర్ భాస్కర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్.అశోక్, స్టేట్ క్వాలిటీ కన్సల్టెంట్ సురేష్ బచ్చు, జిల్లా క్వాలిటీ మేనేజర్ స్రవంతి,  వెంకటస్వామి, సూపర్ వైజర్లు భాగ్యమ్మ, సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ రాములు, స్టాఫ్ నర్సులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.