చత్రపతి శివాజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలి" ** ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జైరామ

Published: Tuesday October 04, 2022

ఆసిఫాబాద్ జిల్లా అక్టోబర్ 03(ప్రజాపాలన, ప్రతినిధి) : ఫిబ్రవరి 19న జరిగే చత్రపతి శివాజీ జయంతిని ప్రభుత్వం  అధికారికంగా నిర్వహించి, సెలవు దినంగా ప్రకటించి, ఆరే కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలని సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మి కి తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి అందజేశారు. ఈ సందర్భంగా ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్టుపల్లి జైరామ్ మాట్లాడుతూ "చత్రపతి శివాజీ మహారాజ్" భారతదేశ చరిత్రలోనే గొప్ప యుద్ధవీరుడు, మహా మేధావి అని, గెరిల్లా యుద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన  సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి అందరి మన్ననలను పొంది చత్రపతి బిరుదాంకితుడైన గొప్ప పాలనాదక్షుడు శివాజీ నేటి పాలకులకు మార్గదర్శి అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడి పాలనను అందించి భావితరాలకు మార్గదర్శకుడిగా నిలిచిన గొప్ప వ్యక్తి శివాజీ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 19 ని పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, గోవా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జయంతిని నిర్వహించి, సెలవు ప్రకటించాలన్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అలా నిర్వహించడం లేదన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం  సెలవు దినంగా ప్రకటించి ఆరె కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చి, అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరె కుల రాష్ట్ర ఉపాధ్యక్షులు దాదా రావు పటేల్,నరులే వాసు పటేల్, జిల్లా ఉపాధ్యక్షులు కోలే బిక్కాజీ, తిరుపతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.