ముందస్తు పట్టణ కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్ట్

Published: Tuesday December 28, 2021
మధిర డిసెంబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో టౌన్ పోలీస్ స్టేషన్ లోటిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు మధిర నియోజకవర్గ శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క గారి పిలుపు మేరకు గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలో జరుగుతున్న కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి మధిర టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు పట్టణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కెసిఆర్ ఖబడ్దార్ అక్రమ అరెస్ట్ నిరసిస్తూ రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని వారు తెలిపారుమధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధనికుమార్ మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ మధిర పట్టణ sc సెల్ అధ్యక్షుడు గద్దల లాలయ్యా, కాంగ్రెస్ నాయకులు ఆదిమూలం శ్రీనివాస్ రావు, వంశీ లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు