ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

Published: Tuesday June 15, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెల్వర్తి గ్రామంలో సోమవారం రెండు లక్షల ఐదు వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కలు పరకాల రామచంద్రు, గంజి నారాయణ, శీలోజి అంజనేయులు, చేగుర్థి బీరయ్యలకు టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కలుకురీ రాములు అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, అలాగే ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధి జరుగుతుందని గ్రామంలో ఉన్న సమస్యలను తీరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ ఉపాధ్యక్షులు పిట్టల కుమార్, మత్స్య శాఖ చైర్మన్ వెంకటేశం, వార్డు సభ్యులు గుర్రాల రాములు, పరకాల కవిత, వేముల విజయలక్ష్మి, కల్కుర్తి ముత్యాలు, కడవేరు సరోజ, గన్నెబోయిన కవిత, బూడిద బిక్షమయ్య, పరకాల వెంకటేశం, కడవేరు యాదగిరి, యువజన సంఘం ఉపాధ్యక్షులు మల్లం నరేష్, కన్వీనర్ నాగలి యాదగిరి, గుండు పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.