రెండవ "ఏఎన్ఏం"లను పర్మినెంట్ చేయాలి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు

Published: Thursday January 12, 2023
 ఈనెల 12 న హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా 
 
బోనకల్ ,జనవరి 11 ప్రజా పాలన ప్రతినిధి: రెండవ ఏఎన్ఎం లను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని, పనిబారం తగ్గించాలని కోరుతూ ఈనెల 12 న ఏఐటీయుసి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మి నారాయణ తో కలిసి అయన విలేకరులతో మాట్లాడుతూ గత 14 సంవత్సరాల క్రితం రెండవ ఏఎన్ఏం లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంపికయ్యామని, అప్పటినుండి ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నా మమ్మల్ని పట్టించుకోవడంలేదని వాపోయారు.
ఒకవైపు పని ఒత్తిడి, మరోవైపు చాలీచాలని జీతాలతో ఎన్నో ఇబ్బందులను ఎదూర్కొంటున్నారాని, పెరిగిన ధరలతో వారి జీతాలు పోటీపడలేక జీవచ్చవంలా బతుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే "కంటివెలుగు" కార్యక్రమానికి సంబందించి ఆన్లైన్ వర్క్ చేసే పరిస్థితి లేదని వారు తేల్చి చెప్పారు. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్పా వారి జీవితాలు మారడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం వారిని గుర్తించి ఎలాంటి పరీక్షలు, షరతులు లేకుండా వారిని పర్మినెంట్ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 16 నంబర్ జిఓ లో రెండో ఏఎన్ఏం లను చేర్చి రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్ తో ధర్నాకు పిలుపునిచ్చామని,ఇందులో పెద్ద సంఖ్యలో రెండవ ఏఎన్ఏం లు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.