జిల్లా కార్యాలయాలలో మౌలిక వసతులు ఏవి..?

Published: Monday May 30, 2022
మంచిర్యాల టౌన్, మే 29, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో మౌలిక వసతులు సరిగా లేపోవడంతో నిత్య సందర్శకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మంచిర్యాల రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి నిత్యం డివిజన్ పరిధిలోని వివిధ మండలాల ప్రజలు అధిక సంఖ్యలో      ఈ కార్యాలయాన్ని సందర్శిస్తూ. ఉంటారు. ప్రస్తుత ఎండ వేడిమి నుంచి కనీసం గొంతు తడుపు కొవడనికి కూడా త్రాగునీరు సౌకర్యాన్ని అధికారులు కల్పించలేదని, సందర్శకులకు మర్గుడొడ్లు లేక నాన అవస్థలు పడుతున్నారు, ప్రభుత్వం పరిశుభ్రత పాటించాలి అని నిత్య చెపుతూనే ఉన్న కార్యాలయాలలో పరిశుభ్రత, కనిపించడం లేదని సందర్శకులు అంటున్నారు. మంచిర్యాల మండల రెవెన్యూ కార్యాలయంలో సిబ్బందికి సహితం త్రాగునీరు లేక వారు సొంతగా వాటర్ బాటిల్స్ వెంట తీసుకురావడం గమనార్హం, నామమాత్రంగా వాటర్ కొంటున్న అవి సరిపోవడం లేదు, ఆఫీస్ లో  మరుగుదొడ్లు ఉన్న అవి లేనట్లుగా వాటి పర్యవేక్షణ లేక నిరుపయోగంగా ఉన్నాయి.ఈ సమస్య కేవలం ఒక్క కార్యాలయానిదే కాదు, జిల్లా ఆసుపత్రి, పలు మండల రెవన్యూ అధికారి ఆఫీస్స్, పోలీస్ శాఖ, పోస్టల్ శాఖ, పలు సంక్షేమ శాఖలు,లోనూ నిత్యం ఇలాంటి ఇబ్బందులనే  సందర్శకులు ఎదుర్కొంటున్నారు.
 
 
       *-- చిప్పకుర్తి శ్రీనివాస్* 
తెలంగాణ విద్యార్థి జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు
 
జిల్లా కార్యాలయాలలో కనీస సౌకర్యాలు అందుబాటులో లేక కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదు దారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు,ఈ సమస్య కేవలం జిల్లా కేంద్రంలో నిది మాత్రమే కాదు మండల స్థాయి లో , గ్రామ స్థాయిలలో కూడా ఉంది దీనిపై జిల్లా కలెక్టరు స్పందించి ప్రభుత్వ కార్యాలయాలలో మౌలిక సదుపాయాలు, కనీసం త్రాగు నీరు అయినా అందుబాటులోకి తీసుకురావాలని ఆశిస్తున్నాం.