నగదు రహిత లావాదేవీలను వినియోగించుకోండి

Published: Tuesday August 31, 2021

బోనకల్లు, ఆగష్టు 30, ప్రజాపాలన ప్రతినిధి : భీమాతోనే జీవితానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఏపీజీవీబీ బ్యాంకు నందు పొదుపు ఖాతా తీసుకోని ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని బోనకల్ బ్రాంచ్ మేనేజర్ సీతారాములు తెలియజేశారు. సోమవారం మండల పరిధిలోని పెద్దబీరవల్లి గ్రామంలో గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖమ్మం జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బ్యాంక్ మేనేజర్ సీతారాములు మాట్లాడుతూ గ్రామీణ బ్యాంక్ అందజేసే సేవలను, వివిధ పథకాల యొక్క లాభాలను తెలియజేయుటకు కళాకారులచేత ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నోడల్ ఆఫీసర్ రమేష్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలు వినియోగించుకోవాలని ప్రతిఒక్క ఖాతాదారుడు భీమా పథకాల విషయాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా, సురక్ష భీమా, యోజన భీమా ప్రీమియంలను తీసుకొవాలని ఏదైనా ప్రమాదవశాత్తు అనుకోని సంఘటనలు జరిగితే కుటుంబానికి భరోసా లభిస్తుందని, పొదుపు ఖాతా తెరవడానికి బ్యాంకుల చుట్టూ తిరిగె అవసరం లేదని మీ ఇంటి వద్దే ఉండి పొదుపు ఖాతా దిశాఏపీజీవిబి యాప్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉందని ప్రతి ఒక్కరూ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆళ్ల పుల్లమ్మ, ఎంపీటీసీ కర్లకుంట, దేవమణి, బోనకల్ బ్యాంక్ సిబ్బంది, వివిధ గ్రామాల బ్యాంక్ మిత్రాలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.