కుంగ్ ఫ్పూ మార్షల్ ఆర్ట్స్ యోధుడు బ్రూస్ జన్మదిన వేడుకలు

Published: Monday November 28, 2022
చౌటుప్పల్ నవంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి): చౌటుప్పల్ గ్రీన్ గ్రూప్ స్కూల్ లో టైగర్స్ కుంగ్ ఫూ కరాటే, స్పోర్ట్స్ ఆధ్వర్యంలో లెజెండరీ ఫైటర్ బ్రూస్ లీ 82 వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేడుకలో భాగంగా కేక్ కట్ చేసారు అనంతరం కోచ్ అనిల్ మాట్లాడుతూ బ్రూస్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను విద్యార్థులకు చెప్పడం జరిగింది అలాగే ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు కుంగ్ ఫు వంటి విద్య ద్వారా విద్యార్థులకు ఆత్మరక్షణ, క్రమశిక్షణ, మానసికంగా మరియు శరీర దృఢత్వంతో శక్తివంతంగా తమను తాము రక్షించుకుంటారు అని అన్నారు. వేడుకలో భాగంగా టైగర్స్ కుంగ్ ఫూ రాష్ట్ర సెక్రెటరీ ఎం శ్రీనివాస్ నల్లగొండ జిల్లా సెక్రెటరీ ఎం శివ గ్రీన్ గ్రూప్ స్కూల్ చైర్మెన్ బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి, అకాడమిక్ డీన్ సతీష్ రెడ్డి, మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.