కెసిఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంతో నలుగురు మహిళల మృతి... చిలుక మధుసూదన్ రెడ్డి* *బాధిత

Published: Thursday September 01, 2022

ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని దీనికి కేసీఆర్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి బాధిత కుటుంబాలను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని  కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో సరైన వసతులు అర్హులైన డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో స్థానిక పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యుల నిర్లక్ష్య కారణంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న మహిళలు వికటించి చనిపోవడం దురదృష్టకరమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తక్షణం అట్టి పేద కుటుంబాలను పరామర్శించి బాధిత కుటుంబానికి 25 లక్షల చొప్పున నష్టపరిహారం,ప్రభుత్వ ఉద్యోగం,డబుల్ బెడ్రూం,ఇల్లు వారి పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలని డిమాండ్ ప్రభుత్వ ఆసుపత్రులలో సరియైన వైద్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం నిన్నటి ఇబ్రహీంపట్నం సంఘటన చూసైనా ఆత్మ విమర్శ చేసుకొని సరైన సౌకర్యాలు కల్పించాలని,అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రైవేటు హాస్పిటల్స్ పైన ఉన్న శ్రద్ధ ప్రభుత్వ ఆసుపత్రులపై లేదన్నారు. జరిగిన సంఘటనలో చికిత్స పొందుతున్న మహిళలందరికీ వారు ఆరోగ్యంగా కోరుకునే అంతవరకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించాలని వారిని కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు..ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు నోటీస్ బోర్డ్ కే పరిమితం అయ్యాయని అభివృద్ధి విషయంలో ఆమడ దూరంలో ఉన్నాయని ఆరోపించారు..సోమవారం జరిగిన సంఘటన పైన బాధిత కుటుంబాలకి అండగా  ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మల్ రెడ్డి రంగారెడ్డి అధ్వర్యంలో* పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి సంబంధిత ఆర్డిఓ మరియు డీఎంహెచ్వో పోలీస్ అధికారులని నిలదీయడం జరిగిందని చెప్పారు . ఇప్పటికైనా ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకొని జరిగిన సంఘటన పైన ఎంక్వయిరీ కమిషన్ వేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని లేనియెడల కాంగ్రెస్ పార్టీ పక్షాన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వంపై పోరాడుతామని హెచ్చరించారు.