పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం : సర్పంచ్ పుల్లమ్మ..

Published: Thursday June 17, 2021
పాలేరు, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి ప్రతి ఒక్కరూ పరిశుభ్రత ను పాటించాలని కోనాయిగూడెం సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ సూచించారు. మండలంలోని కోనాయిగూడెం పంచాయతీలో సైడ్ కాలువ లో షిల్ట్ ను తొలిగించే కార్యక్రమం ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ పనులు ముందస్తుగా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటి వద్ద పారిశుద్ధ్యం పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని ఇంటి చుట్టు శుభ్రంగా ఉంటేనే మనం మంచి ఆరోగ్యంగా ఉంటామని అని సూచించారు. ఇంట్లో నీటి నిల్వలు ఉంచకుండా చూడాలని అన్నారు. ఆరోగ్యవంతమైన కుటుంబాల కోసం ప్రతి కుటుంబం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైడ్ కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ ను చల్లించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వడ్లమూడి నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి బోళ్ల వీరబాబు, పంచాయతీ సిబ్బంది బొడ్డు . ఆంజనేయులు. కస్తాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.