వ్యవసాయాన్ని ఆర్థిక అభివృద్ధిగా మార్చాలి

Published: Thursday December 29, 2022
అల్ ఇండియా రైతు సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ సురేందర్
వికారాబాద్ బ్యూరో 28 డిసెంబర్ ప్రజా పాలన : రైతులు బాగు పడితేనే దేశం బాగుపడితుందని, అగ్రికల్చర్,అగ్రి బిజినెస్ గా మారితేనే రైతులు సంతోషంగా ఉంటారని అల్ ఇండియా రైతు సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ సురేందర్  అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా దారుర్ మండల పరిధిలోని కేరెల్లి గ్రామంలోని రైతు వేదికలో ఫాస్ట్ (ఫౌండేషన్ ఫర్ అగ్రిక్,సుస్టాన్బులిటీ అండ్ ట్రాన్స్ఫార్మషన్ వారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తల,అధికారులు‌, రైతుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతులకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో వ్యవసాయంలో కొత్త పద్ధతుల కు అలవాటు పడాలని,ప్రతి రైతు తమ నేల యొక్క భూసార పరీక్షలు చేయించాలని అన్నారు.రైతులకు సారవంతమైన నేలలు ఉండాలని,ఎరువులు మోతాదుకు తగ్గ  వేయాలన్నారు.విత్తనాల ఎంపికలో లోపం వల్ల రైతులు నష్టపోవడం జరుగుతుందన్నారు.కొన్ని ఏళ్ల క్రితం పెంట కుప్పలు తో వ్యవసాయంలో కానుగ,ఇతర చెట్లతో ఎరువులు తయారు చేసేవాళ్ళమని అన్నారు.ఫాస్ట్ సంస్థలో రైతులు చేరి లాభాలు పొందాలని సూచించారు.నా బార్డు సహకారం ఉంటుందని,దాని ద్వారా నిధులు వస్తాయని పేర్కొన్నారు. కేరెల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం,గ్రామంలో సిసి రోడ్లు ఎంతో సుందరంగా ఉన్నాయని తెలిపారు.గ్రామ అభివృద్ధికి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి నర్సింహారెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, గ్రామస్తులందరి సహకారం అవసరం ఉందన్నారు.రైతులు అందరూ ఒకే సంఘం కావాలని,రైతులకు కావాల్సిన చట్టాలు,ఇన్ ఫుట్స్ అందించాలని అన్నారు. కేరెల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి నర్సింహారెడ్డి మాట్లాడుతూ...రైతులకు మేలు చేసేందుకు ఫాస్ట్ ను తీసుకురావడం జరిగిందని,రైతు శాస్త్రవేత్తలను తీసుకురావడం జరిగిందన్నారు .రైతులు సూచనలు పాటించి,లాభాలు గడించాలని కోరారు.వచ్చే ఏప్రిల్ మే నెలలో సీడ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ ఫౌండేషన్ ఫర్ అగ్రికల్చరల్ సస్టైనబిలిటీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ చైర్మన్ డాక్టర్ పి రామచంద్ర మూర్తి మల్టీమీడియా సెక్రెటరీ భారతీయ కిసాన్ సంగ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అగ్రి హార్టికల్చరల్ సొసైటీ డాక్టర్ సురేందర్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ రామచంద్ర రావు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ సురేందర్ ఎంటోమోలోజిస్ట్ ఇక్రిసాట్ డాక్టర్ మొహమ్మద్ గఫార్ ఇఫ్కో మేనేజర్ డాక్టర్ లచ్చన్న నేషనల్ సీడ్ కార్పొరేషన్ మేనేజర్ డాక్టర్ సలీం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వినోద్ కుమార్ ధరూర్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ జ్యోతి ఆర్టికల్చర్ ఆఫీసర్ అర్చన కేరెల్లి రైతు వేదిక ఏ ఈ ఓ సుజాత రైతులు తదితరులు పాల్గొన్నారు