సేవా సదనములో గౌతమ్ 10వ పుట్టినరోజు వేడుకలు

Published: Monday December 13, 2021
మధిర డిసెంబ12 ప్రజాపాలన ప్రతినిధి మధిర పట్టణం చెందిన విశ్రాంత ఉపాధ్యాయులైన శ్రీ తాళ్లూరి వెంకటేశ్వరరావు రమాదేవి మనుమడు చి" గౌతమ్ 10వ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ వసంతమ్మ సేవా సదనములో కోవిడ్ నిబంధనలను అనుసరించి మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులకు ఈరోజు అన్న వితరణ చేసినారు ఈ సందర్భంగా సేవా సదనం లోని విద్యార్థులు పర్యవేక్షకుడు నారి కుమార్ మాట్లాడుతూ పుట్టినరోజు నాడు ఆర్భాటాలకు ఆడంబరాలకు పోకుండా మానసిక దివ్యాంగుల మధ్య మనవడు పుట్టినరోజు జరుపుకోవడం వారికి వారి కుటుంబ సభ్యులకు దేవుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా సేవా సదనము డైరెక్టర్ డాక్టర్ కె షీలా రాము గారు మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు అన్న వితరణ చేసిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు