సి.పి.ఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నికైన శీలం నరసింహారావు సిపిఎం పార్టీ తరఫున అభినందనల

Published: Thursday December 02, 2021
మధిర డిసెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి : సిపిఎం మహాసభల్లో  నరసింహారావు జిల్లా లా కమిటీ సభ్యుడు అయినందుకు కు అభినందనలు తెలుపుతూసీపీఐఎంఖమ్మం జిల్లా మహాసభలు ఉత్సాహపూరిత వాతావరణంలో రెండురోజుల పాటు  ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్ వేదగిరి శ్రీనివాసరావు నగర్  లో నిర్వహించిన ఈ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా 550 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతి మూడేళ్లకోసారి పార్టీ మహాసభలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ, తీర్మానాల ఆమోదం చేసుకుని తదనుగుణంగా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడం ఆనవాయితీ. దీనిలో భాగంగా ఎంతో క్రమశిక్షణాయుతంగా ఈ మహాసభలను నిర్వహించారు. నూతన కమిటీకి ప్రతినిధులు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. మొత్తం 17 తీర్మానాలను ప్రవేశపెట్టగా వాటిన్నింటినీ ఆమోదించారు. ఈ ఎన్నికల్లో  భాగంగా సి.పి.ఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడిగా మధిర కు చెందిన శీలం. నరసింహారావు ఏనుకున్నారు. శీల నరసింహారావు పార్టీ ప్రస్థానం 19 86లో సిపిఎం పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు, 1995లో అయ్యవారిగూడెం కోపరేటివ్ బ్యాంక్ సొసైటీ అధ్యక్షుడు ఎన్నికయ్యారు. మొదటిసారిగా ఎర్రుపాలెం మండల కార్యదర్శిగా 2001లో  ఎన్నికయ్యారు. 2001 నుంచి 2013 వరకు వరుసగా మూడుసార్లు ఏకగ్రీవంగా ఎర్రుపాలెం మండల కార్యదర్శిగా పని చేశారు, అనంతరం సిపిఎం పార్టీ డివిజన్ అవసరాల నిత్య మధిర కేంద్రానికి సి ఐ టి యు బాధ్యతలు చేపట్టారు, తరువాత సీపీఎం పార్టీలో వచ్చిన మార్పుల ప్రకారం డివిజన్ కేంద్రాలను రద్దు చేయడం మూలంగా మూడు సంవత్సరాల టౌన్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించారు. మొన్న జరిగిన 21వ మహాసభలో జిల్లా కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీలో పలు బాధ్యతలు చేపట్టి తన వంతు కర్తవ్యం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు శీలం. నరసింహారావు మాట్లాడుతూ తన పై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలను అప్పగించినందుకు పార్టీ పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.