పిఆర్సి డిమాండ్లను నెరవేర్చిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన టి ఎన్ జి ఓ జిల్లా నాయకులు

Published: Thursday June 17, 2021

సిద్ధిపేట (ప్రజాపాలన ప్రతినిధి) : ఉద్యోగులకు పిఆర్సి తదితర డిమాండ్లన్నింటిని గొప్ప మనసుతో పరిష్కరించి జీవో విడుదల చేసినందుకు గాను, ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పరమేశ్వర్ కార్యదర్శి విక్రమ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు స్నేహపూర్వక ప్రభుత్వంగా మెదులుతూ అనేక సమస్యలను గత ఏడు సంవత్సరాలుగా పరిష్కరిస్తూ ఉన్నది. దానిలో భాగంగానే 30% ఫిట్మెంట్ తో పిఆర్సి జీవోలను విడుదల చేసినందుకు, సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరియు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న 9.5 లక్షల మంది ఉద్యోగులందరికీ మేలు జరిగే విధంగా రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసి దానికి సంబంధించిన జీవోలను విడుదల చేసినందుకుగాను ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా నాయకులు. టీఎన్జీవో సంఘం ఉద్యోగులను ఐక్యంగా ఉంచి ఫ్రెండ్లీ ప్రభుత్వంలో తప్పకుండా కెసిఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగుల ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది అని దానికి ఎవరు కూడా ఆందోళన చెందవద్దని గత మూడు సంవత్సరాలుగా హామీ ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి సమస్యలను విన్నవించిన మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జీవోలు విడుదల చేసినందుకు తెలంగాణ ఉద్యోగుల పక్షాన టీఎన్జీవో జిల్లా సంఘం ప్రభుత్వానికి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలిపారు... కరోనా కష్టకాలంలో ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పని చేస్తున్నందుకు ఉద్యోగులకు అభినందనలు తెలుపుతూ రాబోయే కాలంలో మరింత అంకితభావంతో ప్రజలకు సేవలు అందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కలలుగన్న బంగారు తెలంగాణ సాధనకు మరింత అంకితభావంతో పని చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్ కార్యదర్శి కొమాండ్ల విక్రం రెడ్డి సహా అధ్యక్షుడు నిమ్మ సురేందర్ రెడ్డి కోశాధికారి అశ్ప్యాక్ అహ్మద్  తదితరులు పాల్గొన్నారు.....