అనాధ అభాగ్యుల మద్య తెలంగాణ తొలి స్పీకర్ సిరకొండ మధుసూదనా చారి జన్మదిన వేడుకలు

Published: Thursday October 14, 2021
బాలాపూర్: అక్టోబర్13, ప్రజాపాలన ప్రతినిధి : మానసిక అభాగ్యుల మధ్యన పుట్టినరోజు జరుపుకుంటునందుకు సంతోషంగా మనసుకు ఆనందంగా ఉందన్నారు తెలంగాణ తొలి స్పీకర్. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నాదర్గుల్ గ్రామంలో మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో బుధవారం  స్వర్ణకార సంఘం అధ్యక్షులు రవీంద్ర చారి ఆధ్వర్యంలో మన తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదన్ చారి జన్మదిన వేడుకలు అభాగ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. అనాధల మధ్య కేక్ కట్ చేశారు. అభాగ్యులకు కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా తొలి స్పీకర్ ఎస్. మధుసూదన్ చారి మాట్లాడుతూ..... మానసిక వికలాంగుల అభాగ్యుల మధ్య నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం పూర్వజన్మ సుకృతం అని అన్నారు. ఈ మానసిక అభాగ్యులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆశ్రమ నిర్వాహకులు గట్టు గిరిని అభినందించారు. వారి సేవలు అద్భుతమని కొనియాడారు. భవిష్యత్తులో ఈ ఆశ్రమానికి సహాయాన్ని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి, గూడెం ఇంద్రసేన, మర్రి శాశంక్ రెడ్డి, మర్రి జగన్ మోహన్ రెడ్డి, స్వర్ణకార సంఘం రాణిపణి రవీంద్ర చారి, లావకోట వెంకటాచారి, మధుమోహన్ చారి, చంద్రమౌళి, జగదీశ్వరా చారి, వేణుబోపాల చారి, సుదర్శన్ చారి, కేశవాచారి, భలేష్ చారి, గురు చరణ్, ఎర్ర బట్ట శ్రీనివాస్ రాజు, సునీల్ అగర్వాల్, లక్ష్మ రామాచారి, తదితరులు పాల్గొన్నారు.