మిట్టపల్లి యూత్ ఆధ్వర్యంలో మందకృష్ణ జన్మదిన వేడుకలు

Published: Friday July 08, 2022
తల్లాడ, జులై 7 (ప్రజాపాలన న్యూస్ ):-                  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దళిత బిడ్డ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలను తల్లాడ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా వచ్చిన గ్రామ సర్పంచ్ మాగంటి కృష్ణయ్య కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దళిత ప్రజల్లో ముఖ్యంగా అన్ని వర్గాలను కలుపుకొని పోతూ అనేక విజయాలు సాధించిన మందకృష్ణ మాదిగను అందరూ ఆదరించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు మాగంటి శ్రీను, మేడి నాగేశ్వరరావు, కోట బలరాం, మాగంటి కళ్యాణ్, మాగంటి గోపి,మాగంటి వెంకీ, కన్నె పోగు శివ, మాగంటి మహేష్, బొల్లె పోగు నాగబాబు, మాగంటి రవి ,మాగంటి అప్పారావు, కన్నె పోగు నవీన్ తదితరులు పాల్గొన్నారు