గోదావరి వరదల్లో పనిచేసిన గ్రామపంచాయతీ కార్మికులకు ఒక నెల వేతనం బోనస్ గా ఇవ్వాలి CITU . బూర్గంపా

Published: Monday October 17, 2022

ఇటీవల సంభవించిన గోదావరి వరదల్లో కష్టపడి పనిచేసిన గ్రామపంచాయతీ కార్మికులకు ఒక నెల వేతనాన్ని బోనస్ గా చెల్లించాలని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి కే బ్రహ్మచారి డిమాండ్ చేశారు. భద్రాచలంలో పనిచేసిన కార్మికులకు ఒక నెల బోనస్ను చెల్లించిన అధికారులు సారపాకలో పనిచేసిన కార్మికులకు చెల్లించకపోవడం అన్యాయమని వారు అన్నారు.సారపాక కార్మికులకు కూడా ఒక నెల వేతనాన్ని బోనస్ రూపంలో వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు యాకూబ్ అధ్యక్షతన సారపాకలు జరిగిన గ్రామపంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో బ్రహ్మచారి మాట్లాడాతూ పంచాయతీ కార్మికులకు సబ్బులు, యూనిఫామ్ బట్టలు, గ్లౌజులు ,కొబ్బరి నూనె,బూట్లు,చెప్పులు అందజేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఐదు సంవత్సరాల సర్వీస్ దాటిన గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, డిమాండ్ చేశారు. ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చొరవ  చూపాలని సిఐటియు డిమాండ్ చేసింది .సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అన్యాయమని సిఐటియు మండిపడింది. పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల పై విధించిన జీఎస్టీ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు .కార్మిక వ్యతిరేక లేబర్ కోడులను రద్దు చేయాలని ,సిఐటియు డిమాండ్ చేసింది .ఈ జనరల్ బాడీ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, సిఐటియు మండల కన్వీనర్ బర్లా తిరుపతయ్య, గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోడి యాకూబ్,  సురేష్ ,సతీష్, చారి, రోశమ్మ, వెంకటమ్మ, నాగమణి, బత్తుల పుష్ప, దమయంతి ,నాగమణి తదితరులు పాల్గొన్నారు.