పట్లూరులో బతుకమ్మ చీరలు పంపిణీ : మర్పల్లి ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్

Published: Tuesday October 12, 2021
వికారాబాద్ బ్యూరో 11 అక్టోబర్ ప్రజాపాలన : మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని మర్పల్లి మండల ఎంపిడిఓ వెంకట్ రామ్ గౌడ్ అన్నారు. సోమవారం వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మర్పల్లి మండలానికి చెందిన పట్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్, ఎంపిటిసిలు స్వప్న సురేష్, మంజుల మహేష్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు బతుకమ్మ చీరలను తయారు చేశారని పేర్కొన్నారు. చేనేత కార్మికుల దుర్భర పరిస్థితిని కొంతైనా తీర్చడానికి బతుకమ్మ చీరల ద్వారా వచ్చే ఆదాయంతో వారి కష్టాలు తీరుతాయని వివరించారు. గ్రామ ప్రవేశ రోడ్డు మార్గానికి ఇరుప్రక్కల ఉన్న మొక్కలకు వైట్ పెయింటింగ్ అవెన్యూ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. మొక్కల చుట్టూ సాసరింగ్ గుంతలు ఏర్పాటు చేయాలని పట్లూరు గ్రామ కార్యదర్శి సంతోషకు సూచించారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన 7 రిజిస్టర్లను పరిశీలించామని స్పష్టం చేశారు. రిజిస్టర్ లను మళ్లీ గ్రామాన్ని విజిట్ చేసే వరకూ అప్డేట్ చేయాలని సూచించారు. రిజిస్టర్ లను అప్డేట్ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామానికి వచ్చిన సుమారు మూడు వేల బతుకమ్మ చీరలలో సోమవారం 500 చీరలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవరదేశి అశోక్ వార్డు మెంబర్లు నర్సింలు, ఖాజా, లాలు, ప్రభు, అంజాద్, సునీల్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్ల ముసలి అశోక్, మైనార్టీ సెల్ అధ్యక్షులు షఫీ, సోషల్ మీడియా ఇంచార్జ్ వికాస్, నాయకులు శ్రీశైలం, మహిళలు తదితరులు పాల్గొన్నారు.