పట్లూరులో తెలంగాణ క్రీడా ప్రాంగణానికి భూమి పూజ

Published: Wednesday June 29, 2022
డిఆర్డిఏ కృష్ణన్
వికారాబాద్ బ్యూరో జూన్ 28 ప్రజా పాలన : గ్రామీణ యువతను శారీరకంగా మానసికంగా దూరంగా చేయడమే లక్ష్యంగా తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని డి ఆర్ డి ఎ కృష్ణన్ అన్నారు. మంగళవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ దేవర దేశి ఇందిరా అశోక్ ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని తయారుచేయడానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతోపాటు ఆటలపాటిల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. నేటి యువత పుస్తకాల పురుగుల్లా తయారవుతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. యువత శారీరకంగా దృఢంగా ఉండాలి అంటే తనకు నచ్చిన ఏదో ఒక ఆటను ఆడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ యువతకు క్రీడల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. సెల్ఫోన్లు టీవీలకు నేటి యువత ఆకర్షించినంతా ఆటలకు కేటాయించడం లేదని విచారం వ్యక్తం చేశారు. క్రీడల్లో పాల్గొన్న యువతకు చతురత ఐకమత్యం సమయస్ఫూర్తి క్రమశిక్షణ వంటి లక్షణాలు అలవడుతాయని చెప్పారు. క్రీడల్లో రాణించిన యువతకు ప్రభుత్వ ఉద్యోగాలలో తగిన రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జగన్నాథం ఏపీవో అంజిరెడ్డి ఇన్చార్జి ఎంపీవో లక్ష్మీకాంత్ విట్టల్ పంచాయతీ కార్యదర్శి సంతోష ఉప సర్పంచ్ మోయిజ్ రైతుబంధు అధ్యక్షుడు శేఖర్ స్వామి పార్టీ అధ్యక్షుడు గొల్ల ముసలి అశోక్ డీలర్ మోహన్ శ్రీశైలం గ్రామస్తులు పాల్గొన్నారు.