ఉచిత మెగా వైద్య శిబిరం ప్రజల్లో విశేష స్పందన

Published: Monday April 25, 2022

మధిర ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు కె.వి.ఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం భారీగా ప్రజలతో విజయవంతం చేసినకె వి ఆర్ ఎమర్జెన్సీ-మణిపాల్ హాస్పిటల్ విజయవాడ సంయుక్తంగా నిర్వహిస్తున్న  ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన-గ్రామాల నుండి తరలివస్తున్న ప్రజలు వైద్య శిబిరాన్ని ప్రారంభించనున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండలం పరిధిలోలో సామాన్య, పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించాలనే ఉద్దేశ్యంతో డాక్టర్ కోట రాంబాబు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.మధిరలో రోగులకు విశేష సేవలు అందిస్తున్న "కేవీఆర్-ఎమర్జెన్సీ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవాడ మణిపాల్ హాస్పిటల్ సహకారంతో రెడ్డీ గార్డెన్స్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మధిర చుట్టుపక్కల ప్రాంతాలనుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఉచిత వైద్యసేవలు పొందుతున్నారు. కార్పోరేట్ వైద్యాన్ని మధిరకు తీసుకువచ్చి ఎంతో విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా అందించటంపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ వైద్య శిబిరానికి ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరుకానున్నారు ఈ కార్యక్రమంలో తక్కెళ్ళపాడుసొసైటీ అధ్యక్షులు. ఐలూరు వెంకటేశ్వర్ రెడ్డి  కోటేశ్వరరావు ఎర్రుపాలెం జెడ్ పి టి సి కవిత సిద్దినేని గూడెంం సొసైటీ అధ్యక్షులు కటికల సీతారామిరెడ్డి లాయర్ మాజీ సర్పంచ్ రామరాజు అదేవిధంగాా టిఆర్ఎస్ పాల్గొన్నారు