రంగ రంగ వైభవంగా జీవధ్వజ ప్రతిష్ఠా మహోత్సవం

Published: Friday May 07, 2021
పాలేరు మే 6( ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా:- నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి గ్రామంలో గురువారం శ్రీలక్ష్మి గణపతి, బ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవాలయంలో నవగ్రహ, ద్వారపాలిక, సుబ్రహ్మణ్య పరివార శీతల(బొడ్డురాయి), జీవధ్వజ ప్రతిష్ఠా మహోత్స కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు. కోదాడ పట్టణం కు చెందిన వావిలాల లక్ష్మీనారాయణ శర్మ, తుంగతుర్తి కోటేశ్వరరావు శర్మల ఆధ్వర్యంలో వేదపండితుల సమక్షంలో ప్రతిష్టా మహోత్సవం ను జరిపారు. గత మూడు రోజుల నుంచి గ్రామంలో జాతర ను తలపించే విధంగా కార్యక్రమాలు జరిపారు. ప్రతిష్ఠా కార్యక్రమం కు గ్రామం అంతా బంధువులు, స్నేహితులతో నిండిపోయింది. దేవాలయం ను నూతనంగా నిర్మించేందుకు తీవ్రంగా కృషి చేసి ఇటీవల మృతి చెందిన పంచాయతీరాజ్ అభియాన్ చైర్మన్ నాగుబండి సత్యనారాయణను పలువురు గుర్తు చేసుకున్నారు. త్వరలోనే దేవాలయంకు సమీపంలో నాగుబండి సత్యనారాయణ కాంస్య విగ్రహంను ఏర్పాటు చేయనున్నారు. సత్యనారాయణ ను పలువురు గుర్తు చేసుకున్నారు. త్వరలోనే దేవాలయంకు సమీపంలో సత్యనారాయణ కాంస్య విగ్రహంను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్, సోసైటీ చైర్మన్ నాగుబండి శ్రీనివాసరావు, సర్పంచ్ కొండ్రు విజయలక్ష్మి, ఎంపీటీసీ ఉసిరికాయల లక్ష్మయ్య, దేవాలయం నిర్మాణ కమిటి పెద్దలు గడ్డం సత్యం, నల్లాని మల్లిఖార్జున్ రావు, మారగాని లక్ష్మినారాయణ, ఉసిరికాయల శ్రీనివాసరావు, బీమాల శ్రీనివాసరావు, తాళ్లూరి సత్యనారాయణ, వేనేపల్లి నాగేశ్వరరావు పైనంపల్లి దేవాలయం లో ద్వజస్థంభం వద్ద భక్తులు. తదితరులు పాల్గొన్నారు.